Kantara | రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటినుంచే టీమ్‌ను అనేక ప్రమాదాలు, విషాద సంఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా, ప్రముఖ కన్నడ నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మరణించారు. ఉడిపిలోని హిరియడ్కలోని తన నివాసంలో ఆయన కుప్పకూలి చనిపోయారు. ఆయనకు గుండెకి సంబంధించిన చికిత్స జరిగినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. చికిత్స తర్వాత బాగానే ఉన్నా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూసారు.గత కొద్ది రోజులుగా కాంతార ఛాప్టర్ 1మూవీకి సంబంధించిన ఎవరో ఒకరు ఇలా కన్నుమూస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.
కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వరుసగా ప్రమాదాలు, విషాద సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత నవంబర్‌లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న వ్యాన్‌కి ప్రమాదం జరగడంతో చాలా మందికి గాయాలు అయ్యాయి.ఆ తర్వాత మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) నదిలో మునిగి చనిపోవడం, హాస్యనటుడు రాకేష్ పూజారి (33) గుండెపోటుతో మరణించడం వంటి సంఘటనలు చిత్ర బృందాన్ని కలవరపరిచాయి. ఇటీవల కళాభవన్ నిజూ కూడా గుండెపోటుతో మరణించినట్టు శాండల్ వుడ్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు కర్ణాటక రాష్ట్రం శివమొగా జిల్లా మణి జలాశయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు తిరగబడి నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది నీటిలో పడిపోయినట్టు ఇటీవల వార్తలు చ్చాయి. అయితే, హోంబాలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండిస్తూ.. గాలి వాన వల్ల సెట్ కూలింది తప్ప ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని ఆయన తెలియజేశారు. గతంలో కూడా గాలి వాన వలన కాంతార టీమ్ వేసిన భారీ సెట్ కుప్పకూలింది. ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మూవీ రిలీజ్‌కి దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు టీమ్‌ని టెన్షన్‌కి గురి చేస్తుంది. ఈ సినిమాకోసం హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ప్రత్యేకమైన యుద్ధ కళను కూడా నేర్చుకున్నాడు, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 విడుదల చేయబోతున్నారు.