Kantara Movie | తెలుగు స్టేట్స్లో ‘కాంతార’ మూవీ సరికొత్త రికార్డు..!
Kantara Movie New Record | 'కేజీఎఫ్' తర్వాత ఆ స్థాయిలో కాంతార చిత్రానికి ఇండియా వైడ్‌గా విపరీతమైన ఆదరణ వస్తుంది. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది.
Kantara Movie New Record | ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో కాంతార చిత్రానికి ఇండియా వైడ్‌గా విపరీతమైన ఆదరణ వస్తుంది. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. రిషబ్‌శెట్టి నటనకు, దర్శకత్వానికి ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. కన్నడలో అత్యధిక మంది వీక్షించిన సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డు సాధించింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధిస్తుంది. తాజాగా ఈ చిత్రం తెలుగులో 50కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రెంజ్లో కలెక్షన్లు సాధిస్తుందంటే విశేషం అనే చెప్పాలి. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్రం అల్లు అరవింద్‌కు దాదాపు పదింతలు లాభాలు తీసుకొచ్చింది. ఇక తెలుగులో కాంతార చిత్రానికి మూడో వారం థియేటర్ కౌంట్ విపరీతంగా పెరిగింది. రెండో వారానికి దాదాపు రెండింతలు థియేటర్ల సంఖ్య పెరిగింది. ఇక ఇండియా వైడ్‌గా ఈ చిత్రం రూ.౩౦౦ కోట్ల కలెక్షన్లు సాధించింది. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సంప్తమీ గౌడ హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

