Kantara |మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం ₹15 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం, వరల్డ్‌వైడ్‌గా ₹400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘కాంతార చాప్టర్ -1’ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన హీరోగా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేకర్స్ అక్టోబర్ 2న సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి భారీ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన, సాయంత్రం 7 గంటలకు వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ షోలు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది జరిగితే, కన్నడ ఇండస్ట్రీలో ప్రీమియర్స్ నిర్వహించిన తొలి భారీ సినిమా ఇదే అవుతుంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటికే ప్రీమియర్స్ మంచి ఫలితాలివ్వగా, ఆ ట్రెండ్‌ను ఈ మూవీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘కాంతార చాప్టర్ 1’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలైతే ఈ క్రేజ్ ఇంకాస్త పెరుగుతుంది. ఇక ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ వస్తే, సినిమా విడుదల రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ దిశగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో స్పెషల్ షోలు కూడా కలెక్షన్లకు బాగా హెల్ప్ అవుతాయి.
ఇప్పటి వరకు మేకర్స్ ప్రీమియర్ షోలపై అధికారికంగా ప్రకటించలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఇది ఖచ్చితమేనని టాక్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.మరోవైపు నార్త్ అమెరికాలో 50కి పైగా ఐమాక్స్ స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం శాండల్‌వుడ్‌లో సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.