Kannappa Movie | మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్ అప్డేట్ను ఇచ్చింది. ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.
The teaser for ‘Kannappa🏹’ is finally arriving on 14th June. We are thrilled to share this special project with everyone. Stay tuned for an amazing glimpse into the world of #Kannappa!#KannappaTeaser #KannappaTeaseron14thJune@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas… pic.twitter.com/6y1ODLWzBL
— Kannappa The Movie (@kannappamovie) June 7, 2024