Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) రీసెంట్గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa)ను గ్రాండ్‌గా లాంఛ్ చేశాడని తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్ కూడా షురూ అయింది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఏదో ఒక అప్డేట్ అందిస్తూ మూవీ లవర్స్ లో జోష్ నింపుతోంది విష్ణు టీం.
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ నయా అప్డేట్ను షేర్ చేశారు. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ విష్ణు మంచు పుట్టిన రోజు (నవంబర్ 23)ను పురస్కరించుకొని స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం రేపు ఉదయం 02:45 గంటలకు (న్యూజిలాండ్‌లో ఉదయం 10:15 గంటలకు) ప్రకటన ఉండబోతుంది. విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కన్నప్ప కోసం లెజెండరీ యాక్టర్లు మోహన్ బాబు, శరత్‌కుమార్ న్యూజిలాండ్‌లో చిట్ చాట్ సెషన్లో పాల్గొన్న స్టిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌పై పాగా వేయాలని గట్టిగా ఫిక్సయినట్టు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అర్థమవుతోంది.
Two superstars, the legends ‘Pedarayudu’, Mohan Babu Sir and Sharath Kumar Sir, unite for ‘Kannappa’ in New Zealand. Adding their immense star power to this highly anticipated Indian cinematic extravaganza. Get ready for a legendary tale of devotion and grandeur! 🌟🏹… pic.twitter.com/0wJhgECRrV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023
Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale
“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP
— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023