Kannappa | మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, బ్రహ్మనందం వంటి అగ్రనటులు కీలకపాత్రలు పోషించారు. స్టీఫెన్ దేవస్సి సంగీత సారథ్యం వహించగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం విడుదల కాగా, మూవీకి మంచి రెస్పాన్సే వచ్చింది. ‘కన్నప్ప’ మూవీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. తిన్నడిగా విష్ణు మంచు యాక్టింగ్ అదరగొట్టారని, రుద్రగా ప్రభాస్ జీవించేశారంటూ చెప్పుకొచ్చారు.
ఓ సినిమా నిజాయతీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని మంచు విష్ణు తాజాగా చెప్పుకొచ్చారు. ప్రభాస్ కారణంగానే తమ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని కూడా అన్నారు. అయితే ‘కన్నప్ప’ మొదటి రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు చూపించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్టు సమాచారం. ఫస్ట్ డేతో పోలిస్తే, హిందీ వెర్షన్లో రెండో రోజు 40 శాతం పెరుగుదల కనిపించింది. ఇండియా లెవెల్లో తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు: రూ.8.25 కోట్లు, తమిళం: రూ.1.5 కోట్లు, హిందీ: రూ.65 లక్షలు, కన్నడ: రూ.10 లక్షలు, మలయాళం: రూ.20 లక్షలు.
అంటే మొత్తంగా ఇండియాలో తొలి రోజు రూ.9.35 కోట్ల నెట్ వసూలు చేసిన ‘కన్నప్ప’, రెండో రోజు మాత్రం కొద్దిగా తగ్గుదలతో రూ.7 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అన్నీ భాషల్లో కలిపి రెండో రోజు నెట్ కలెక్షన్ రూ.16.35 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.వీకెండ్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెంట్‌తో పాటు విజువల్స్, టెక్నికల్ స్టాండర్డ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ఈ మూవీని దాదాపు వంద కోట్లతో రూపొందినట్టు సమాచారం. అంటే సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ వసూలు చేస్తే నిర్మాతలు సేఫ్ అయినట్టే. మరి మూడు రోజుల్లో అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి లాంగ్ రన్ ఉంటుంది. అది కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.