Kannappa Teaser 2 | మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే వరుస ప్రమోషన్స్ చేస్తున్న ఈ చిత్రం తాజాగా మరో టీజర్‌ను వదిలింది.
నాస్తికుడిగా ఉన్న కన్నప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు అనే కథతో ఈ సినిమా రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్ చివరిలో రుద్రుడిగా ప్రభాస్ లుక్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి. హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.