Kannappa Movie Preity Mukhundhan first Look | ఒకవైపు ఫ్యామిలీ గొడవలతో సతమవుతున్న మంచు ఫ్యామిలీ.. మరోవైపు తమ కలల ప్రాజెక్ట్ కన్నప్పను పూర్తి చేసే పనిలో పడింది. మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు.
హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రీతి కన్నప్ప ఇష్టసఖి, చెంచుల యువరాణి నెమలి పాత్రలో నటిస్తుంది.
”అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్వం.. కన్నప్పకి సర్వస్వం చెంచుల యువరాణి నెమలి అంటూ” ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది.
✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹
✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺
Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K
— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024