Kannappa Movie Countdown | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుంచి కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో శివుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. “జూన్ 27న ‘కన్నప్ప’ మీ ముందుకు వస్తోంది. ఇంకా కేవలం 28 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి” అంటూ మంచు విష్ణు ఈ పోస్టర్‌ను తన ‘ఎక్స్’ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలిఉంది. నేడు చెన్నై వీధుల్లో కన్నప్ప గర్జించనున్నాడు. తమిళ మీడియా ముందు ఇప్పటివరకు చూడని అన్‌సీన్ ఫుటేజ్‌ని ప్రదర్శంచనున్నాం. భక్తి, యాక్షన్, మీ హృదయాన్ని కదిలించే కథతో జూన్ 27న రానున్నాం అంటూ విష్ణు రాసుకోచ్చాడు.
బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ తారాగణం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మిస్ అయినట్లు చిత్రబృందం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు కూడా నమోదు చేసింది. కాగా దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Only 28 days left!
Today, Kannappa roars through the streets of Chennai. Showing the unseen footage to Tamil Media.
Devotion, action, and a story that will move your soul, on June 27th#Kannappa #HarHarMahadev
— Vishnu Manchu (@iVishnuManchu) May 30, 2025