మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తిశ్వర స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. డిసెంబర్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రంలో ముఖేష్‌రుషి, బ్రహ్మాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రుషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. పురాతమైన పుళిందుల తెగకు చెందిన వీరిని భద్రగణం అని కూడా పిలుస్తారు. వాయిలింగానికి వంశపారంపర్యంగా సేవలు చేస్తు భద్రగణాన్ని నడిపిస్తుంటారని, వీరి పాత్రలకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.