మంచు విష్ణు టైటిల్ పాత్రలో భక్తిరస ప్రధానంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాలో మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ చిత్ర టీజర్‌ను ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో హీరో మంచు విష్ణు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.