Yevam | చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యేవమ్’. నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాందిని చౌదరి, ఆషురెడ్డిలతో పాటు భరత్‌రాజ్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలో కన్నడ రాయల్ స్టార్ యుగంధర్ పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక యుగంధర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన చాందిని చౌదరి, ఆషు రెడ్డి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కీర్తన శేషు, సినిమాటోగ్రాఫర్ ఎస్వీ విశ్వేశ్వర్, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
*Twitter :*
𝐁𝐞𝐰𝐚𝐫𝐞 𝐡𝐢𝐬 𝐜𝐡𝐚𝐫𝐦 ❤️🔥👓
Introducing ‘𝐘𝐔𝐆𝐀𝐍𝐃𝐇𝐀𝐑’ from #Yevam 💥🚨
Stay tuned for the reveal tomorrow!#YevamMovie @YevamMovie🌟 @iChandiniC @ImSimhaa @AashuReddy99 @BharatRaj0921@prakash_d@pnavdeep26 @pavangoparaju pic.twitter.com/BqtykWdSFP
— Maduri Mattaiah Naidu (@madurimadhu1) May 17, 2024