Jailer Movie Cast | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టు లేదు. మధ్యలో ‘పేట’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం రజనీకాంత్ ఆశలన్ని ‘జైలర్’ పైనే ఉన్నాయి. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా చిత్రబృందం బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
జైలర్ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కాగా తాజాగా ఈయన సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్రయూనిట్ ఓ ఫోటోను రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ ఈ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం.
Dr.Shiva Rajkumar from the sets of #Jailer 🔥@rajinikanth @NimmaShivanna @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/fLb9KRBRF0
— Sun Pictures (@sunpictures) November 17, 2022