Siddharth | కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల (CauveryIssue) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కర్ణాటక బంద్‌కు కూడా అక్కడి ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే కావేరి జలాల వివాదం సినీ పరిశ్రమను రౌండప్ చేస్తోంది. సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రాల్లో ఒకటి (Chiththa). ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా కర్ణాటకలో జరిగిన ఈవెంట్‌కు సిద్దార్థ్ హాజరయ్యాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో కావేరి జలాలపై ఆందోళన చేస్తున్న కొందరు నిరసన కారులు వచ్చారు. ప్రెస్ మీట్‌ను నిర్వహించేందుకు వీలు లేదని, రద్దు చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారుల ప్రవర్తనతో ఏం చేయలేక బయటకు వెళ్లిపోయాడు సిద్దార్థ్. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు కన్నడ స్టార్ హీర్ శివరాజ్‌కుమార్. కావేరి జలాల విషయాన్ని ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దంటూ కోరారు.
కావేరి జలాల ఆందోళన పట్ల విచారం వ్యక్తం చేస్తూ కన్నడ ఇండస్ట్రీ తరపున సిద్దార్థ్‌ను క్షమాపణలు కోరుతున్నట్టు ప్రకటించాడు శివరాజ్ కుమార్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సిద్దార్థ్‌కు మద్దతుగా నిలిచిన శివరాజ్ కుమార్ ఔదర్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్. Chiththa సెప్టెంబర్ 28న విడుదలైంది.
ప్రమోషనల్ ఈవెంట్లో ఆందోళన..
BREAKING: #Chiththa actor #Siddharth was FORCED to leave in the middle of a press conference which held at Karnataka. #CauveryIssue | #CauveryWater protestors have suddenly entered the event and asked Siddharth to… pic.twitter.com/6fBcQufuRX
— Manobala Vijayabalan (@ManobalaV) September 28, 2023
శివరాజ్‌కుమార్ క్షమాపణలు..
@NimmaShivanna heartly apology to tamil actor #Siddharth on behalf of entire KFI for yesterday’s unfortunate incident.#Shivanna #Shivarajkumar #Chittha #Chikku #CauveryIssue pic.twitter.com/3smqiByQlj
— NAMMA CINEMA (@nammacinemaka) September 29, 2023