Kannada Actor Dhruwan | కన్నడ నటుడు ధృవన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ధృవన్ మైసూర్ నుంచి ఊటీకి బైక్‌పై వెళ్తుండగా.. మైసూర్-గుడ్లుపేట్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీ కొట్టాడు. దాంతో ధృవన్ తీవ్రంగా గాయాల పాలయ్యాడు. వెంటనే ఆయన్ను మైసూర్‌లోని మనిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనలో ధృవన్ కుడి కాలు నుజ్జునుజ్జయింది. దాంతో వైద్యులు సర్జరీ చేసి ఆయన కాలును తీసేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ధృవన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దివంగత ప్రొడ్యూసర్ పార్వతమ్మ రాజ్ కుమార్ సోదరుడు, సినీ నిర్మాత ఎస్ఏ శ్రీనివాస్ కొడుకే ధృవన్. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయనను సూరజ్ కుమార్ అని పిలిచేవాళ్లు. ఇక సినిమాల్లోకి వచ్చాకా ధృవన్‌గా పేరు మార్చుకున్నాడు. ధృవన్ ‘భగవన్ శ్రీ కృష్ణ’ అనే సినిమాతో డెబ్యూ చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం ధృవన్ ‘రథం’ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్‌తో మరో సినిమాకు సైన్ చేశాడు.