Kanguva Glimps | కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ కంగువా. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసింది ఈయనే. ఇక ఇప్పుడు సూర్యతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజైంది. టీజర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు. ఓ యుద్ద క్షేత్రంలో శవాలు, చుట్టూ మంటలు.. వాటి మధ్య నుంచి బల్లెం పట్టుకుని సూర్య ఎంట్రీ. పరాక్రమవంతుడు, అపజయం ఎరుగని వీరుడు కంగువా అంటూ సూర్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం గూస్బంప్స్ తెప్పిస్తుంది. విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. చివర్లో కుశలమా అంటూ సూర్య చూపించిన వేరియేషన్ గ్లింప్స్‌కే హైలెట్‌గా నిలిచింది. గ్లింప్స్ చూస్తుంటే సూర్య ఈ సినిమాలో కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది.
మొత్తంగా గ్లింప్స్‌తో సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. గ్లింప్స్‌లో సూర్య తప్ప మరో పాత్రను చూపించలేదు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఈ సినిమా తమిళం నుంచి తొలి వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. స్టూడీయో గ్రీన్ బ్యానర్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమానూ నిర్మిస్తుంది. సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దీశా పటానీ నటిస్తుంది. దాదాపు పది భాషల్లో ౩డీలో ఈ సినిమా రూపొందుతుంది.