Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు సూర్య. ఈ స్టార్ నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న కంగువ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవలే థాయ్‌లాండ్‌లో కీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్. తాజాగా ఫైనల్ షెడ్యూల్ అప్డేట్ బయటకు వచ్చింది. చెన్నై షెడ్యూల్లో వార్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నట్టు న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం చెన్నైలోని EVP Film Cityలో ఇవాళ ఫైనల్ షెడ్యూల్ షురూ అయింది. సూర్య, బాబీడియోల్, దిశాపటానీపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు మేకర్స్.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 2024 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్సైడ్ టాక్. కంగువలో సూర్య వారియర్‌గా నయా అవతార్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వారియర్.. లీడర్.. కింగ్.. సూర్య రాజసం ఉట్టిపడేలా గుర్రంపై వస్తున్న వారియర్ లుక్‌తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు సూర్య.
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt
— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
Kanguva
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023