Kangana Ranaut Eectricity bill | తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని బాలీవుడ్ నటి బీజేపీ ఎంపి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఒక సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది కంగన.
”మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు. అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉందంటూ చెప్పుకోచ్చింది. అయితే ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ బోర్డు స్పందిస్తూ.. కంగన చేసిన వ్యాఖ్యలు అబద్దమంటూ తిప్పికొట్టింది.
ఈ విషయంపై HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. కంగనా చెప్పినట్లు ఆమె కరెంట్ బిల్లు రూ.లక్ష దాటలేదని.. దాదాపు రూ. 91,000 వరకు ఉందని తెలిపారు. కంగన గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో.. పాత బకాయిలకు కొత్త బిల్లు జత అయ్యి అలా చూపించిందని తెలిపారు. చివరిగా ఆమె జనవరిలో కరెంట్ బిల్లు కట్టిందని.. ఆ తర్వాత పవర్ బిల్లు చెల్లించకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెల బిల్లులు కలిసి అలా చూపించిదని వెల్లడించారు. ఒక మార్చిలోనే కంగన ఇంటి కరెంట్ బిల్లు రూ.55000 వచ్చినట్లు బోర్డు పేర్కోంది.
BJP MP Kangana Ranaut during a public gathering had claimed that she had received a Rs 1 lakh bill for her Manali residence where she didn’t even stay.
Now, Himachal Pradesh State Electricity Board fact-checked her claim. They claimed that Kangana didn’t pay her bills on time… pic.twitter.com/fKDtUKAqPL— Mohammed Zubair (@zoo_bear) April 10, 2025