Kangana ranaut | దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ 291 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 233 చోట్ల లీడ్లో కొనసాగుతోంది. కాగా లోక్సభ ఎన్నికల బరిలో సినీ తారల్లో బాలీవుడ్ నటి కంగనారనౌత్, మాలీవుడ్ యాక్టర్ సురేశ్ గోపీ మొదటి నుంచి తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇద్దరూ 70వేలకు పైగా ఓట్ల మెజారిటీలో ఉండటం విశేషం.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం కంగనారనౌత్ (Kangana ranaut) హోం టౌన్ మండి (హిమాచల్ ప్రదేశ్) లోక్సభ నియోజకవర్గం నుంచి 70,210 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)లో కొనసాగుతుండగా.. సురేశ్ గోపీ (Kangana ranaut) త్రిస్సూర్ (కేరళ) లోక్సభ నియోజకవర్గం నుంచి 71,136 ఓట్ల ఆధిక్యం (బీజేపీ) లో కొనసాగుతున్నారు.