బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ను ముంబై డ్రగ్స్ కేసులో ఇటీవలే ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్యన్ కు మద్దతుగా నిలుస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) పోస్ట్ పెట్టాడు. అయితే ఈ సందేశం మింగుడు పడకపోవడంతో నటి కంగనారనౌత్ (Kangana Ranaut) రంగంలోకి దిగింది. హృతిక్ రోషన్ పోస్టుకు పరోక్షంగా టార్గెట్ చేసింది కంగనా.
ఇపుడు మాఫియా పప్పులందరూ ఆర్యన్ ఖాన్ కు రక్షణగా వస్తున్నారు. మేము తప్పులు చేస్తాం కానీ వాటిని కీర్తించకూడదు. ఇది అతని దృక్పథాన్ని చెప్తూ..అతడు చేస్తున్న చర్యల పర్యావసాలను అతనికి తెలియజేస్తుందని నేను నమ్ముతున్నా. అది అతన్ని మరింత మంచిగా, గొప్పగా ఉండేలా చేయగలదు. ఎవరైనా బలహీనమైపోయినపుడు వారి గురించి పుకార్లు చేయకపోవడం మంచిది కానీ ఏ తప్పు చేయలేదని వారికి అనిపించడం నేరమని, పరోక్షంగా హృతిక్ రోషన్ పోస్టుకు కౌంటర్ ఎటాక్ చేసింది కంగనా.
జీవితం ఓ వింత ప్రయాణంలాంటిది. అది అస్థిరమైనది. ఇప్పుడు నీకొచ్చిన కష్టం చూసి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నావని తెలుసు. కోపం, అయోమయం, నిస్సహాయ స్థితిలో ఉన్నావు. వీటిని పంపించి వేసే హీరోని బయటకు తేవాలి. నువ్వు ఏది గుర్తుంచుకోవాలి, ఏది వదిలేయాలి అనుకుంటావో వైఫల్యాలు, విజయాలు అన్నీ సమానమే అంటూ ఆర్యన్‌కు సూచిస్తూ పోస్ట్ పెట్టాడు హృతిక్ రోషన్.
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
Tamannaah | అలా మారడం కష్టమైన పని : తమన్నా
Nagendra Babu | నరేశ్ది నరం లేని నాలుక..అందరి కోసం ‘మా’ : నాగబాబు
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్