నిత్యం ఏదో ఒక వివాదాలతో రచ్చ చేస్తుంటుంది బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్. అందుకే అమ్మడిని హిందీ జనాలు కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తుంటారు. తాజాగా ఆమె ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాతల్లో ఒకరైన కరణ్‌జోహార్‌పై తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. సినిమా బాగోలేదని మీడియాలో వచ్చిన సమీక్షల రేటింగ్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దర్శకుడు అయాన్ ముఖర్జీని గొప్ప దర్శకుడని పొగిడిన వాళ్లందరిని జైల్లో వేయాలని చెప్పింది. ఈ సినిమా తీయడానికి అతను పన్నెండేళ్ల సమయం తీసుకున్నాడని, దాదాపు ఆరొందల కోట్లను వృథా చేశాడని విమర్శించింది.
అలాంటి చెత్త దర్శకుణ్ని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ఇక నిర్మాత కరణ్‌జోహార్‌పై కూడా కంగనా విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన తన సినిమా వ్యవహారాల కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారని, అందుకే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని తెలిపింది. డబ్బులతో వ్యవస్థల్ని మేనేజ్ చేద్దామని చూసే బదులు ప్రతిభావంతుల్ని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని చురకలంటించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ పోస్ట్ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.