ముంబై : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాల్యంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. ఓటీటీ షో లాకప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కంగనా మునావర్ ఫరూఖి బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడంపై అతడిని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు.
చిన్నప్పుడు తన కంటే కొన్నేండ్లు పెద్ద అయిన వ్యక్తి తనను అభ్యంతరకరంగా తాకాడని గుర్తుచేశారు. చాలా మంది చిన్నారులు ఇలాంటి వేధింపులకు గురవుతుంటారు..బహిరంగ వేధికపై వీటిని చర్చించేందుకు మనం వెనుకాడుతుంటామని కంగనా చెప్పుకొచ్చారు.
మనమందరమూ ఏదో ఒక సమయంలో అభ్యంతరకరంగా తాకడం వంటి వేధింపులు ఎదుర్కొని ఉంటాం..నా చిన్నతనంలో మా స్వస్ధలంలో ఓ బాలుడు తనను అభ్యంతరకరంగా తాకాడని, ఆ సమయంలో దాని గురించి తనకు తెలియదని అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేందుకు ఈ షోను వేదికగా ఎంచుకున్నామని చెప్పారు.