Kandula Durgesh | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్నాయని తెలిసిందే. అయితే ఇదే సమస్యపై పలువురు అగ్ర నిర్మాతలు నేడు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కార్మిక సంఘాల డిమాండ్లను చర్చించడంతో పాటు పలు సమస్యలపై చర్చించనట్లు సమాచారం. అలాగే ఈ సమస్యలను త్వరగా పరిష్కారించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కావాలని నిర్మాతలు మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రంను అందించారు.
ఈ సమవేశంపై కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తెలియజేయడానికి నిర్మాతలు వచ్చి కలిశారు. అంతేతప్ప ప్రత్యేక ఏజెండా అంటూ ఏం లేదు. ప్రస్తుతం ఉన్న సమస్యపై రెండు వైపుల నుంచి వినడంతో పాటు సలహాలు సుచనాలు తీసుకుంటాం. ఈ విషయాన్ని పెద్దగా చేయకుంగా ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు కలిసి మాట్లాడుకోవాలి. దీని గురించి అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి వరకు తీసుకువెళతాను. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. స్టూడియోలు, రీ-రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటూ కందుల చెప్పుకోచ్చాడు.
ఈ సమావేశం అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు. అలాగే సినిమా రంగాన్ని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని, సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ భేటీలో బీవీఎస్ఎన్ ప్రసాద్, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వప్రసాద్, నాగవంశీ, డీవీవీ దానయ్య, బన్నీ వాసు తదితర ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు.
రాష్ట్ర సచివాలయంలో సినీ నిర్మాతలతో సమావేశమై, సినీ రంగ సమస్యలు మరియు సినీ కార్మికుల ఆందోళనలపై నిర్మాతల నుండి వినతిపత్రం స్వీకరించాను. ఇరుపక్షాల అభిప్రాయాలను శ్రద్ధగా విని, ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రుల గార్లకు నివేదించి చర్చిస్తానని తెలియజేశాను. అలాగే… pic.twitter.com/RGvBHMXcCC
— Kandula Durgesh (@kanduladurgesh) August 11, 2025