Vikram Movie Collections | లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను రాబడుతుంది. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ.200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.
కేవలం ఐదు రోజుల్లోనే ‘విక్రమ్’ ఈ ఘనత సాధించింది అంటే విశేషం అనే చెప్పాలి. దాదాపు రూ.95.75 కోట్లతో రంగంలోకి దిగిన ఈ చిత్రం రూ.105.50 కోట్ల కలెక్షన్లను సాధించి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు.రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
తెలుగులో విక్రమ్ చిత్రాన్ని హీరో నితిన్ విడుదల చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే రూ 7.6 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. కాగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి విక్రమ్ సినిమా రూ.9.18 కోట్ల షేర్‌ను సాధించింది. ఇప్పటికే చిత్రం బయ్యర్లు కోటిన్నరకు పైగానే లాభాలను తెచ్చిపెట్టింది.
#Vikram enters the ₹ 200 Crs WW Gross Club.. 🔥
— Ramesh Bala (@rameshlaus) June 7, 2022