Kamal haasan Vikram Movie | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్, విజన్ వేరే లెవల్. కాగా విడుదలైన మొదటి రోజు నుండే కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ.400 కోట్ల క్లబ్లో చేరింది.
‘విక్రమ్’ రిలీజైన నెల రోజుల్లోపే రూ.400 కోట్ల మార్కును సాధించడం విశేషం అనే చెప్పాలి. రజనీకాంత్ రోబో2.0 తర్వాత రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ సినిమాగా విక్రమ్ రికార్డు క్రియేట్ చేసింది. లేటెస్ట్గా ఈ చిత్రం బాహుబలి పేరిట ఉన్న తమిళ రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
తెలుగులో ‘విక్రమ్’ చిత్రాన్ని హీరో నితిన్ విడుదల చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.16.28 కోట్ల షేర్‌ను సాధించింది. ఈ చిత్రాన్ని కోన్ని బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక ఇటీవలే కమల్ హాసన్ ఈ చిత్రం ఘన విజయం సాధించినందకు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్కు స్పెషల్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే.
KamalHaasan's #Vikram is refusing to slow down at the box office. The film is all set to enter the Rs 400 crore club soon.#IndustryHitVikram #VikramHitlist
— Ramesh Bala (@rameshlaus) June 25, 2022