Vikram Movie Collections | లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ వసూళ్ళను రాబడుతుంది. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.
కేవలం 11 రోజుల్లోనే ‘విక్రమ్’ ఈ ఘనత సాధించింది అంటే విశేషం అనే చెప్పాలి. తెలుగులో విక్రమ్ చిత్రాన్ని హీరో నితిన్ విడుదల చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాగా 11 రోజులు పూర్తయ్యే సరికి విక్రమ్ సినిమా రూ.14.40 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య గెస్ట్ రోల్లో నటించాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
#Vikram blue blooded blockbuster! Crosses worldwide ₹300 Cr in 11 days! pic.twitter.com/eLDCeClD1p
— Sreedhar Pillai (@sri50) June 14, 2022