Sugar Baby | కమల్ హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి “షుగర్ బేబీ” అనే రెండో పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో త్రిష ప్రధానంగా కనిపించింది. ఈ పాటకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు, అనంత శ్రీరామ్ తెలుగులో సాహిత్యం అందించారు. అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఈ పాటను పాడారు.
‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్, శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజూ జార్జ్, నాజర్, అభిరామి వంటి తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడింది.