Kamal Haasan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబోల్లో ఒకటి కమల్‌హాసన్ (Kamal Haasan)- శంకర్ (Shankar). ఈ ఇద్దరి నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం జులై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది కమల్ హాసన్ టీం.
ప్రమోషన్స్‌లో భాగంగా నేడు చెన్నైలోని Palazzo forum mallలో ఇండియన్ 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఏర్పాటు చేశారని తెలిసిందే. ఈవెంట్‌కు కమల్ హాసన్‌తోపాటు చిత్రయూనిట్ హాజరైంది. ఉలగనాయగన్ బ్లాక్ గాగుల్స్‌తో స్టైలిష్ అవతార్‌లో ఈవెంట్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా.. అక్కడ ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.
ఇండియన్ 2 నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
Stylish Ulaganayagan #KamalHaasan Entry at #Indian2trailer launch at Palazzo, forum mall🔥 #Indian2#ComeBackIndian#SenapathyIsBack#Hindustani2#Bharateeyudu2pic.twitter.com/iuys2wB9lY
— Nammavar (@nammavar11) June 25, 2024
ఇండియన్ 2 INTRO ..