చెన్నై: ప్రఖ్యాత ఫిల్మ్ హీరో కమల్‌హాసన్(Kamal Haasan) ఇవాళ ఓ భారీ ప్రకటన రిలీజ్ చేశారు. ఉలగ నాయగన్ అన్న టైటిల్‌ను పరిత్యజిస్తున్నట్లు ప్రకటించారు. తనను సినీ అభిమానులు యూనివర్సల్ హీరో అని పిలుస్తుంటారని, అయితే ఆ టైటిల్‌ను వదిలేస్తున్నట్లు ఆయన చెప్పారు. కమల్‌హాసన్ 2018లో మక్కల్ నీధి మయిం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తనను ముద్దుగా పిలిచే అన్ని టైటిళ్లను త్యజిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రేమతో తనకు బిరుదులు ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతతో ఉన్నట్లు తెలిపారు.
కళాకారులను కళను మించి చూడరాదు అని, మీ ప్రేమాభిమానాలకు పొంగిపోతున్నట్లు కమల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తనలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన పేరు ముందు వాడే టైటిలళ్లను మర్యాదపూర్వకంగా వదిలేస్తున్నట్లు వెల్లడించారు. సింపుల్‌గా తనను కమల్ లేదా కమల్‌హాసన్ అని పిలిస్తే సరిపోతుందని సినీ అభిమానులను, పార్టీ కార్యకర్తలను, మీడియాను ఆయన కోరారు.
உங்கள் நான்,
கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2
— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024