Kamal Haasan | ఆ విషయంలో స్ట్రగుల్ పడ్డాను.. అలాంటి పాత్ర చేస్తే అదో ఆత్మసంతృప్తి: కమల్‌హాసన్
తెరపై కమల్‌హాసన్ పోషించని పాత్ర, పండించని ఉద్వేగం లేదంటే అతిశయోక్తికాదు. దాంతో ఆయనకు కొత్త పాత్రలు రాయడం దర్శకులకు సవాలుగా మారింది.
Kamal Haasan | తెరపై కమల్‌హాసన్ పోషించని పాత్ర, పండించని ఉద్వేగం లేదంటే అతిశయోక్తికాదు. దాంతో ఆయనకు కొత్త పాత్రలు రాయడం దర్శకులకు సవాలుగా మారింది. అందుకే ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు కమల్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల గురించి, అందులోని తన పాత్రల గురించీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు కమల్.
‘ఏపాత్ర పడితే ఆ పాత్ర చేయలేం. నటించడానికి అవకాశం ఉన్న పాత్ర చేస్తే అదో ఆత్మసంతృప్తి. కొన్నేళ్లు ఈ విషయంలోనే స్ట్రగుల్ పడ్డాను. ప్రస్తుతం చేస్తున్న పాత్రలన్నీ గొప్పవే. ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ రెండు సినిమాల షూటింగ్‌లూ పూర్తయ్యాయి.
కేరక్టరైజేషన్ పాతదే అయినా, సినిమాలో కొత్తదనం ఉంటుంది. ‘ఇండియన్ 2’ విడుదలయ్యాక, ‘ఇండియన్ 3’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో పాల్గొంటా. ఇక మణిరత్నంతో చేస్తున్న ‘థగ్‌లైఫ్’ షూటింగ్ ఎన్నికల హడావిడి అయిపోయాక మొదలుపెడతాం. ‘కల్కి 2989’లో నాది విలన్ పాత్ర. నన్నందులో కొత్తగా చూస్తారు. ఇందులోని నా భాగం షూటింగ్ పూర్తిచేశాను.’ అంటూ చెప్పుకొచ్చారు కమల్‌హాసన్. వీటితోపాటు శ్రుతిహాసన్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కలిసి నటించిన స్పెషల్ సాంగ్ ‘ఇనిమేల్’కు కూడా కమల్ వర్క్ చేశారు. ఆ పాట రాసింది కమల్‌హాసనే. సోమవారం ఈ పాట విడుదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

