Antony | హలో సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరిసింది పాపులర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ ప్రస్తుతం తమిళం, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా మాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఒకటైన ఆంటోని (Antony) మూవీ అప్డేట్ అందించింది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ (Antony First Look)తోపాటు మోషన్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పాపులర్ మలయాళ యాక్టర్ జోజ్ జార్జ్, కళ్యాణి ప్రియదర్శి, చెంబన్ వినోద్, నైనా ఉషా కాంబోలో వస్తున్న ఈ మూవీకి జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. జోజ్ జార్జ్ లైటర్‌తో సిగరెట్ వెలిగిస్తుంటూ.. నంబర్ 10 స్పోర్ట్స్ జెర్సీలో కనిపిస్తోంది కళ్యాణి ప్రియదర్శన్. తాజా లుక్‌తోపాటు క్యారెక్టర్లను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
కళ్యాణి ప్రియదర్శన్ మరోవైపు తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న Genieలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అర్జునన్ జేఆర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వామికా గబ్బి, కృతి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. టాలీవుడ్లో కూడా సూపర్ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో మరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తారా..?లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కళ్యాణి ప్రియదర్శన్ ఆంటోనీ లుక్..
Here’s our first look for #Antony! Hope you guys like it! This is a film that has pushed me physically to beyond what I believed were my limits and I can’t wait for you guys to see it all ♥️ pic.twitter.com/KCoJtfacUu
— Kalyani Priyadarshan (@kalyanipriyan) July 9, 2023