NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర కోసం తన బాడీని మార్చుకుంటారనే విషయం మనందరికి తెలిసిందే. ముందు బొద్దుగా కనిపించి ఆ తర్వాత సన్నబడ్డారు. కృస్ణవంశీ రూపొందించిన ఎమోషనల్ రివేంజ్ డ్రామా `రాఖీ` వరకు ఎన్టీఆర్ కాస్త లావుగానే ఉన్నారు. అయితే రాజమౌళితో సినిమా చేయాలంటే బరువు తగ్గాల్సిందేనని కండీషన్ పెట్టడంతో యమదొంగ చిత్రంలో చాలా స్లిమ్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రభస వరకు ఎన్టీఆర్ అదే బాడీని మెయింటైన్ చేస్తూ వచ్చారు. టెంపర్ నుండి కాస్త పెరగడం మొదు పెట్టారు.
జనతాగ్యారేజ్ లో కొంత బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత కొంత తగ్గినట్టు కనిపించారు. ఇక దేవరలో బాగానే ఉన్నారు. కాని ఆ తరువాత ఎన్టీఆర్ ఫిజిక్‌లో డ్రాస్టికల్ ఛేంజ్ కనిపించింది. ఇటీవల ఎన్టీఆర్ ఎప్పుడు కనిపించిన చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఎందుకు ఎన్టీఆర్ ఇంత సన్నాగా మారాడు, జూనియర్ ముఖంలో మునుపటి గ్లో కనిపించడం లేదని, ఇలా తగ్గడం ప్రమాదకరం అని వాపోతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇలా తగ్గాడా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపిస్తే ఓ సింహంలా ఉంటాడని, అలాంటి ఆయనని మరీ బక్కపలచకగా చూడలేకపోతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్.. అర్జున్ s/o వైజయంతి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్ననేపథ్యంలో ఎన్టీఆర్ ఎందుకు సన్నగా అయ్యారు.. మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా.. ? అని అడగ్గా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “ఎన్టీఆర్ ఓ సూపర్ స్టార్. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్. నేషనల్ లెవల్ కు ఆయన స్థాయి చేరింది. దేశంలోనే టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. వాళ్లిద్దరికీ నేను సలహాలు ఇస్తానా..? నేను, తారక్ ఏం చేసినా సినిమా కోసమే..” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమా కోసమే ఎన్టీఆర్ ఇలా మారాడేమో అని అందరు ముచ్చటించుకుంటున్నారు.