నందమూరి కల్యాణ్‌రామ్ ఇప్పటికి హీరోగా 20 సినిమాలు పూర్తి చేశారు. ఆయన 21వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. 8కోట్ల ఖర్చుతో కల్యాణ్‌రామ్ కెరీర్లోనే అత్యంతభారీగా ఈ సినిమా ైక్లెమాక్స్ని మేకర్స్ పూర్తి చేశారు. కేవలం క్లైమాక్స్‌కి 8కోట్లు ఖర్చు చేయడం కల్యాణ్‌రామ్ కెరీర్లో ప్రథమం. హైదరాబాద్ శివార్లలో.. బ్రహ్మకడలి మ్యాసీవ్‌గా డిజైన్ చేసిన భారీ సెట్లో, యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ పర్యవేక్షణలో ఈ ైక్లెమాక్స్ని చిత్రీకరించారు.
ప్రముఖ తారాగణంతోపాటు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ ైక్లెమాక్స్ సీక్వెన్స్‌లో పాల్గొనడం విశేషం. సినిమాకే ఈ ైక్లెమాక్స్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల విరామం తర్వాత విజయశాంతి ఇందులో ఐపీఎస్ అధికారిగా కమాండింగ్ కేరక్టర్ చేస్తుండటం మరో విశేషం. సోహైల్‌ఖాన్, సాయిమంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, సమర్పణ: ముప్పా వెంకయ్య, నిర్మాణం: అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.