Kalyan Kamaneeyam First Single | విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. వర్షం, బాబీ సినిమాల దర్శకుడు శోభన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రంతో గౌతమ్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సంతోష్ ‘తను నేను’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచిరోజులు వచ్చాయి వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంతోష్ నాలుగు సినిమలను సెట్స్ పైన ఉంచాడు. అందులో కళ్యాణం కమనీయం ఒకటి. అనీల్ కుమార్ ఆల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా ఈ సినిమాలోని వెడ్డింగ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఓ మనసా అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. పెళ్ళి కార్యక్రమాలన్నిటిని మొత్తం ఒక పాటలో చూసినట్లు ఉంది. శ్రవణ్ భరద్వాజ్ స్వర పరిచిన ఈ పాట పెళ్ళి పాటల్లో ఒకటిగా నిలిచిపోతుంది. కృష్ణ కాంత్ సాహిత్య అందించిన ఈ పాటను లలితా కావ్యతో కలిసి శ్రవణ్ ఆలపించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్ నిర్మించింది. సంతోష్‌కు జోడీగా ప్రియా భవాని శంకర్ నటిస్తుంది. ఇక ప్రతీ సంక్రాంతికి రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా రిలీజ్ అవడం సర్వ సాధరణమే. ఈ నేపథ్యంలోనే కళ్యాణం కమనీయం కూడా సంక్రాంతి పండగకు ముస్తాబవుతుంది.