Kalpana Rai| కల్పనా రాయ్..ఈ నటి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో లేడి కమెడీయన్‌గా నటించిన కల్పనా చివరి రోజులలో చాలా ధీనమైన స్థితిలో కన్నుమూసింది. చివరి రోజులలో ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న వారు కంట కన్నీరు పెట్టుకుండా ఉండలేరు. కల్పనా రాయ్ ఎన్నో సినిమాలలో తన హాస్యంతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించింది. ఆమె తొలి చిత్రం “నీడలేని ఆడది”. చివరి చిత్రం సోగ్గాడు. కల్పనా రాయ్ దాదాపు 430 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆమె స్వస్ధలం కాకినాడ. అయితే రెండేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడిన ఆమె 2008వ సంవత్సరంలో హైదరాబాదులో ఇందిరానగర్ లో మృతి చెందింది.
కల్పనా రాయ్ చివరి రోజులు చాలా కష్టంగా నడిచాయి. కష్టాలలో ఉన్న వారికి తనవంతు సాయం చేసే కల్పనాని చివరి రోజుల్లో పట్టించుకునే వారు లేరు. ఆమె మంచితనమే కల్పనాకు శాపంగా మారింది. ఆస్తి తగ్గగానే ఎవరు పట్టించుకోలేదు. పెళ్లి చేసుకుండా ఒంటరిగా ఉన్న కల్పనా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేస్తే, ఆమె ఓ అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లింది. ఎంతో ప్రాణంగా పెంచుకున్న కూతురు అలా తనను మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది కల్పనా రాయ్ . చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించింది.
తన చేతులతో వండి ఎందరికో కడుపులు నింపిన కల్పనా రాయ్ కి చివరి రోజుల్లో తిండి పెట్టే వారే లేరు. కనీసం ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు ఇచ్చారని గతంలో నటి జయ శ్రీ చెప్పుకొచ్చింది. అంతటి కష్టం ఏ ఆర్టిస్టుకూ రాకూడదు అని బాధపడింది. కల్పనా రాయ్ చివరి రోజులలో ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయింది. 1950లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి కాగా, యుక్తవయసులో ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే రెండు కళ్లు సరిపోయేవి కావని చెప్పేవారు. అయితే ఆమె పెళ్లికి కూడా ఎందుకు దూరంగా ఉందో ఎవరికి తెలియదు.