Kalki 2898 AD | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వాయిదా పడననున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చినట్లుగానే ఈ సినిమా వాయిదా పడింది. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 09న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా తేదీని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
మే 09 న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన అనంతరం తెలంగాణ లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడింది. దీంతో ఎలక్షన్ ఎఫెక్ట్ ఈ సినిమా పడునున్నట్లు చిత్రయూనిట్ భావించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర సీజీ వర్క్స్ కూడా ఇంకా పూర్తి కాలేదని టాక్. ఇందులో భాగంగానే ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త విడుదల తేదీని ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు.
The Force will Rise on….?
New release date announcement on April-17th #Kalki2898AD.#Prabhas #Kalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/7eTDbAqYOO— Vyjayanthi Movies 🧢 (@PaBlo1979oct) April 10, 2024
ఈ సినిమాకు మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, పశుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం (Mahabharat) కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది.