Kalki 2898 AD | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది.
ఇప్పటివరకు ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.640 కోట్లుకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇంతకుముందు ఈ రికార్డు షారుఖ్ పేరిటా ఉండగా.. తాజాగా ఆ రికార్డును ప్రభాస్ అధిగమించాడు. షారూక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా దేశవ్యాప్తంగా రూ.640 కోట్లు వసూళ్లు సాధించి ఈ రికార్డు సాధించిన నాలుగో చిత్రంగా ఉండేది. తాజాగా జవాన్ వెనక్కి నెట్టి ఆ ప్లేస్‌లో కల్కి వచ్చి చేరింది.
దేశవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలను చూసుకుంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి 2 చిత్రం రూ. 1030 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు చూసుకుంటే..
1. బాహుబలి 2: రూ. 1030.42 కోట్లు
2. కేజీఎఫ్ 2: రూ. 859.7 కోట్లు
3. ఆర్ఆర్ఆర్ : రూ. 782.2 కోట్లు
4. కల్కి 2898 AD: రూ. 640.6 కోట్లు
5. జవాన్: రూ. 640.25 కోట్లు
6. యానిమల్: రూ. 553.87 కోట్లు
7. పఠాన్: రూ. 543.09 కోట్లు
8. గదర్ 2: రూ. 525.7 కోట్లు
9. బాహుబలి: 421 కోట్లు
10.రోబో 2.0: రూ. 407.05 కోట్లు