Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేస్తున్నాడు. వరల్డ్‌వైడ్‌గా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది ప్రభాస్ టీం. ఈ మూవీలో మూడో ప్రపంచం షంబాలా ఉండబోతుందని తెలియజేశాడు నాగ్ అశ్విన్.
తాజాగా షంబాలా ప్రపంచం ఎలా ఉండబోతుందో లుక్ విడుదల చేశారు. సినిమాకే హైలెట్‌గా షంబాలా వరల్డ్ ఉండబోతుందని తాజా స్టిల్ అర్థమైపోతుంది. భూమి మీద మొదటి నగరం.. ఇప్పుడు ఆకరి నగరం ఐడియాతో మొదలుపెట్టాం కల్కి. దేవుడిని నిషేధించిన నగరమిది. షంబాలాలో కూడా ఓ నమ్మకం ఉండేది. భవిష్యత్‌లో కలియుగం పూర్తయిన తర్వాత.. గంగ ఎండిపోయిన తర్వాత చివరి సిటీ ఏముంటుంది..,? మన కాశీ ఉంటుందనుకుంటే.. కల్కిలో మూడో ప్రపంచం షంబాలా అంటూ షేర్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా, అతని దోస్త్ బుజ్జి (Bujji) పాత్రలో స్పెషల్ కారు కనిపించనుంది. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటిస్తుండగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
షంబాలా లుక్..
𝐒𝐡𝐚𝐦𝐛𝐚𝐥𝐚: 𝐖𝐚𝐢𝐭𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐇𝐨𝐦𝐞.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/yOxj2Ebl78
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 21, 2024
The future is now…
Presenting Episode 2 – The World of #Kalki2898AD ft. Director @nagashwin7.#Kalki2898ADonJune27 pic.twitter.com/Pwezvkl8D0
— Kalki 2898 AD (@Kalki2898AD) June 20, 2024