Kalki 2898 AD | మరో 5 రోజుల్లో ప్రభాస్ కల్కి సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ రిలీజ్ ట్రైలర్లో ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్అశ్విన్. ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాలన్నీ ఒకెత్తు.. ‘కల్కి 2898’ ఒకెత్తు అనేలా ఉంది ఈ కొత్త ట్రైలర్.
అయితే ఈ ట్రైలర్ చూసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫిదా అవ్వడంతో పాటు ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే నెటిజన్లకు ఈ ట్రైలర్‌పై ఒక టాస్క్‌ను ఇస్తూ.. ఒక పజిల్‌ను పోస్ట్ చేశాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కొన్ని లెటర్స్‌ను మిస్ చేశాడు. ఈ పజిల్‌ను ఎవరైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్లకి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు. మరిఇంకెందుకు ఆలస్యం ఆ పజిల్‌ను మీరు సాల్వ్ చేయగలరేమో ట్రై చేయండి.
🔥🔥🔥 Check out the M_____F___ing P_____ L___ing A___ B____ing Trailer of KALKI 2898 AD😘😘😘 .. I will give 1 lakh prize for whoever first fills the correct words in the blanks 💪💪💪 https://t.co/Moex5gZKnV
— Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2024