Kalki 2898 AD | అగ్రనటుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ఇంకా 7 రోజులు ఉండగా.. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్ది హైప్ పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు మరింత భారీగా పెరిగాయి. రీసెంట్గా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ (U/A certificate) ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే.. 3 గంటల 56 సెకండ్లు రన్ టైం అని తెలుస్తుంది. మరోవైపు ఈ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. 3 గంటలు సీట్లో నుంచి కుర్చోనివ్వకుండా చేసింది ఈ చిత్రం. ఇందులో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు ఉన్నట్లు సెన్సార్ సభ్యులు తెలిపారు.
కాగా, ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిన విషయమే. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమా రిలీజ్ కానుంది.
#KALKI2898AD (3D) cleared by the censor board U/A certificate. The approved run time of the film is 3Hrs 1 min.#Prabhas
Grand Release on June 27thNo Cult #Prabhas Fan Will pass without liking this post 🔥
Release KALKI Trailer 2 Now#KALKI2898AD#LaunchKalkiLeakedTrailer pic.twitter.com/mR2F2rDyfw
— Prabhas(Darling)Fan Page 𝕏 (@Riya_connect) June 20, 2024