మానస్.. ప్రియాంక రిలేషన్‌పై కొద్ది రోజులుగా హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గేమ్‌లో భాగంగా ప్రియాంకతో నీకున్న రిలేషన్ ఏంటి? అని మానస్‌ను సన్నీ అడిగాడు. ఫ్రెండ్స్ అని సింపుల్‌గా చెప్పేశాడు మానస్. మానస్ నుంచి నువ్ ఏం ఆశిస్తున్నావ్? అని మానసే ప్రియాంకను అడిగాడు. వంట చేసేటప్పుడే వాడుతావా నీ బుర్రను, నీ నిర్ణయాల మీద ఎందుకు నిలబడవు అంటూ ఆనీకి రవి, శ్రీరామచంద్రలు ప్రశ్నలు సంధించారు.
గెలవడానికి వచ్చావా? గెలిపించడానికి వచ్చావా?.. బుర్రను వాడవా?.. అంటూ సన్నీకి రవి ప్రశ్నలు సంధించాడు. గెలవడానికే వచ్చాను.. టాస్కుల్లో ఫ్రెండ్స్ అని చూడనంటూ సన్నీ సమాధానం చెప్పాడు. సెంటరాఫ్ అట్రాక్షన్ అవ్వడం నీకు ఇష్టమా? అని సన్నీని మానస్ ప్రశ్నించాడు. నాకు అలాంటి ఫీలింగ్ ఉండదని సన్నీ అన్నాడు. నువ్ చేస్తే గేమ్? వేరే వాళ్లు చేస్తే కాదా? ఆ టీషర్టుల టాస్కులో మానస్‌ను ఎందుకు పట్టుకున్నావ్ అని సన్నీని సిరి ప్రశ్నించింది. నాది స్ట్రాటజీ కాదు సర్ అని సన్నీ ఏదో చెప్పబోయాడు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు.
ప్రభావితం చేస్తున్నావా? మైండ్‌ను ప్రొవొక్ చేస్తున్నావా? అని రవిని శ్రీరామచంద్ర అడిగాడు. ఇంత వరకు ఆయన్ను ప్రభావితం గానీ ప్రొవోక్ గానీ చేయలేదని రవి క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లని వాడుకుని ఎందుకు ఆడుతున్నావ్? అని మానస్ అడిగేశాడు. ఇంట్లో ఉన్నది వాడటానికే కదా? అందుకే వాడుతున్నాను అని రవి నేరుగా ఆన్సర్ ఇచ్చేశాడు. ఇప్పటికీ ఎప్పటికీ నేనే మానస్‌ని ఫ్రెండ్‌లా ఫీలవుతున్నాను కాజల్ చెప్పేసింది.