బిగ్ బాస్ సీజన్ 5 నుండి 14వ వారం ఎలిమినేట్ అయిన కాజల్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఫుల్‌గా ఎంటర్టైన్మెంట్ పంచిన విషయం తెలిసిందే. కాజల్ గొడవలకు కారణం అవుతుందని,ఆమె వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయని హౌజ్‌మేట్స్ పలుమార్లు అభిప్రాయపడ్డారు. ఎట్టకేలకు బిగ్ బాస్ చివరి వారం ఆమె హౌజ్ నుండి బయటకు వచ్చింది.
అయితే కాజల్ హౌజ్‌లో ఉన్నప్పుడు తనకు రూ.30 లక్షల అప్పు ఉందని చెప్పుకొచ్చింది. మరి ఆ అప్పు బిగ్ బాస్ వారు ఇచ్చిన రెమ్యునరేషన్‌తో తీరుతుందా, అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడికి బిగ్ బాస్ యాజమాన్యం వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్ చేశారట! అంటే 14 వారాలకుగానూ కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది.
కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ కావలసి ఉన్నా కూడా జస్వంత్ వలన ఓ సారి సేవ్ అయింది. సన్నీ, మానస్‌లతో కుదిరిన దోస్తీతో ఆమె కొన్నాళ్లు తన ప్రయాణాన్ని సాఫీగా సాగించింది. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి ముఖ్య కారకురాలైంది కాజల్. ఆ సమయంలో హౌస్ అంతా తనను తిట్టిపోస్తున్నా వెనక్కి తగ్గకుండా సన్నీకి పాస్ వచ్చేలా చేసింది. తనకు కనెక్ట్ అయినవారి కోసం ఏదైనా చేస్తుంది అనే అభిప్రాయం జనాలలో కలిగింది.