కాజల్ సరదాగా మాట్లాడిన మాటలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. కిచెన్ వైపు రావడం లేదుగా అని కాజల్ అనడంతో లోబో మిడిల్ ఫింగర్ చూపించాడు. దీనికి ఓవరాక్షన్ చేయకు అని మండిపడింది కాజల్. లోబో ఏం తెలియనట్టుగా.. ‘నేను ఏం అన్నా ఇప్పుడు’? అని అన్నాడు. ‘ఏం అనలేదు.. చేశావ్.. అది నేను చూశాను.. అని అన్నది.
నేను పైకి వేలు చూపించా? అని చెప్పాడు లోబో. ఇప్పుడు ఏ ఫింగర్ చూపించావో.. ఇంతకు ముందు ఏ ఫింగర్ చూపించావో నేను చూశాను అని చెప్పింది కాజల్. నేను నిజంగానే ఆ ఫింగర్ మాత్రమే చూపించా? అని లోబో అనగా.. నువ్ ఏ ఫింగర్ చూపించావో.. రిక్వెస్ట్ చేసి వీడియో చూపించనా? అని అన్నది కాజల్. కావాలంటే నీకు పేపర్‌పై రాసిస్తా అని అన్నాడు లోబో. సర్లే నువ్ ఇంతలా చెప్తున్నావ్ కాబట్టి.. నువ్ కామెడీ కోసమే చేశావ్ అనే అనుకుంటున్నా అని చెప్పింది కాజల్.
అయితే తనని అన్నందుకు రవి..కాజల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. నువ్వు మజాక్ చేస్తే చేయి కానీ దానికి లిమిట్ ఉంటుంది.. కనీసం నేను ఏం చెప్తున్నానో కూడా వినడం లేదు.. నువ్ సంతోషపడుతున్నావ్ బాగానే ఉంది కానీ.. ప్రొవోకింగ్ చేస్తున్నావ్.. మళ్లీ నేను తిరిగి ఏదైనా అంటే హర్ట్ అవుతావ్.. అని అన్నాడు రవి.
అయితే కాజల్.. మానస్ దగ్గరకు వెళ్లి లోబో తనకి మిడిల్ ఫింగర్ చూపించిన విషయాన్ని షేర్ చేసుకుంది. నువ్ చూశావా? అని మానస్ అడగ్గా.. నేను చూశాను.. తప్పని చెప్పాను అని అంది కాజల్. అయితే చివర్లో లోబో మిడిల్ ఫింగర్ చూపించింది నిజమే.. వాడు చేసింది తప్పే అని నిజం బయటపెట్టేశాడు రవి. ప్రియాంకతో కూడా లోబో తనకి మిడిల్ ఫింగర్ చూపించాడని కాజల్ చెప్పడంతో.. నాకు అలా ఎవడైనా చూపిస్తే కట్ చేసిపడేస్తా.. అని అన్నది. అయితే కాజల్ మాత్రం.. ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి హింసకు తావులేదు.. నా వరకూ నేను నా బాధ చెప్పుకున్నా అంతే అని అన్నది.