ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో మెరిసింది టాలీవుడ్ (Tollywood) కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ భామ ఈ సారి రూటు మార్చేసింది. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్షన్ లో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జున, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాగార్జున స్టైలిష్ గా ఖడ్గం పట్టుకున్న ప్రీ లుక్ స్టిల్ విడుదలవగా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. తాజాగా కాజల్ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ స్టిల్ ను షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాజల్ సేఫ్టీ జాకెట్ లో కనిపిస్తూ చేతిలో గన్ పట్టుకుని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్తున్న సీన్ ను వింటోంది. తాజా లుక్ తో కాజల్ ఈ సారి యాక్షన్ అవతార్ లో కనిపించబోతుందని తెలుస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ అప్ డేట్ ను ఇవ్వనుంది ప్రవీణ్ సత్తారు టీం.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నారాయణ్‌దాస్ కె. నారంగ్, పీ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్