Kajal Aggarwal son | టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ దశాబ్ధంన్నర కాలం పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. దాదాపు ఇప్పుడున్న టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరితో ఈవిడ నటించింది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ తాజాగా మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తన భర్త గౌతమ్ కిచ్లు, చెల్లెలు నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా గౌతమ్ కిచ్లు తన కొడుకు పేరును ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
గౌతమ్ తన కొడుకు పేరు నీల్ కిచ్లు అని ఇన్స్టాగ్రామ్ ద్వారా నెటీజన్లతో పంచుకున్నాడు. దీనిపై నెటీజన్లు, సినీప్రముఖులు బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఒక కాజల్ గతేడాది ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే కాజల్ కూడా అప్పుడు ఏమి స్పందించలేదు. ఇక జనవరిలో తను ప్రెగ్నెంట్ అంటూ బేబి బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికోస్తే తెలుగులో చిరంజీవితో కిలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. వీటితో పాటుగా హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమాలో నటించింది. ఈ మూడు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.