వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. దశాబ్దంన్నర కాలం ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఈ తార పాండమిక్ టైమ్‌లో పెళ్లి చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చింది. ‘ఆచార్య’ సినిమాను మధ్యలోనే వదులుకోగా..నాగార్జునతో నటించాల్సిన ‘ఘోస్ట్’ చిత్రాన్ని కూడా వదులుకుంది. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుంచి బయటకొచ్చింది కానీ ఆ సినిమా వాయిదాలు పడటం వల్ల మళ్లీ ఆ చిత్ర టీమ్‌లో జాయిన్ అయ్యింది కాజల్. ఈ చిత్రం కోసం హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
కాజల్ స్పందిస్తూ…‘నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ సినిమా కోసం సిద్ధమవుతున్నా. మరోసారి సినిమా ప్రపంచంలోకి రావడం ఆనందంగా ఉంది. నాలో కొంత మార్పు రావడం గమనించా. తల్లయ్యాక ఇది సహజమే కదా. మళ్లీ మొదటి నుంచీ ప్రారంభించాలి. శ్రమించి నిన్నటిలా మారుతా. నా అప్‌గ్రేడ్ వెర్షన్ చూపిస్తా’ అని పేర్కొంది.