Kajal Aggarwal | కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లైన తర్వాత సినిమాలు తగ్గించింది. పూర్తిగా తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తుంది. ఏదో అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు, గౌరవం దక్కించుకుంది కాజల్. పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక మొదలుకుని అన్ని విధాలుగా హుందాగా వ్యవహరించడం, ఒక వివాహితగా బాధ్యతాయుతంగా ఉండడం చూడముచ్చటగా అనిపిస్తుంది. తల్లి అయినప్పటి నుండి అయితే కొడుకు ఆలనాపాలనా చూసుకుంటూ సరదాగా గడుపుతుంది. ఎక్కడికి వెళ్లిన కొడుకుని తీసుకొనే వెళుతుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ మాల్దీవ్ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. కుమారుడు, కొడుకుతో పాటు తన చెల్లి నిషా అగర్వాల్‌తో ఫుల్ చిల్ అవుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ సారి బికినీ వేసి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. వైట్ కలర్ బికినీలో సూపర్ హాట్‌గా కనిపిస్తున్న కాజల్‌ని చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఇద్దరు బికినీలో కనిపిస్తూ తెగ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వారి పిక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
మొత్తానికి కాజల్ అగర్వాల్ తన మదర్ డ్యూటీని నిర్వర్తిస్తూనే ఎప్పటికప్పుడు కొడుకుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా మరింతగా ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కాజల్ నటించిన కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాలో గెస్ట్ పాత్రలో మాత్రమే కనిపిస్తుంది. ముందు ముందు సెకండ్ ఇన్నింగ్స్‌లో అక్కగా, అమ్మగా కాజల్ నటిస్తే కచ్చితంగా మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరి కాజల్ అలా నటించేందుకు సిద్దమేనా , లేకుంటే హీరోయిన్‌గానే మరికొన్నాళ్లు కొనసాగిస్తుందా చూడాలి. 2020లో పెళ్లి చేసుకున్న కాజల్ 2022 ఏప్రిల్ 19న కుమారుడు నీల్ కిచ్లూకి జన్మనిచ్చింది. ఇక అప్పటి నుండి కాజల్ అగర్వాల్ సినిమాలకి కాస్త దూరంగానే ఉంటుంది.