హీరోగా వచ్చి.. విలన్గా మెప్పించిన కైకాల..
kaikala satyanarayana | తనదైన నటనతో నవరస నటసార్వభౌముడిగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ తొలుత హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. అయితే తొలి సినిమాతో ఆయన పరాజయాన్ని
హైదరాబాద్: తనదైన నటనతో నవరస నటసార్వభౌముడిగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ తొలుత హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. అయితే తొలి సినిమాతో ఆయన పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. దీంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం చాలా కాలంపాటు ఆయన నిరీక్షించాల్సి వచ్చింది. అయితే దర్శకుడు విఠలాచార్య ఇచ్చిన సలహాతో విలన్గా నటించడం ప్రారంభించారు. దీంతో అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.

కైకాల సత్యనారాయణ 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. అయితే అంతలా ఆడకపోవడంతో సరైన అవకాశాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చిత్రసీమలో నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ.. తన తొలి హీరోయిన్ జమునతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. అనేక సినిమాల్లో ఆమెను భయపెట్టే పాత్రల్లోనూ కనిపించారు. ‘ఈ కాలం దంపతులు’ అనే చిత్రంలో హీరోగా జమునతోనే కలిసి నటించారు. అయితే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఆయన కథనాయకుడిగా చేసిన ‘తాయారమ్మ-బంగారయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నది. తర్వాత సంసారం-సాగరం, మొరటోడు వంటి సినిమాల్లో కైకాల హీరోగా చేశారు.

అయితే కైకాలలోని విలనిజాన్ని విఠాలాచార్య గుర్తించారు. సినీపరిశ్రమలో ప్రతినాయక ప్రాతలు వేసేవారు తక్కువగా ఉన్నారని, అటువైపు వెళ్లాలని ఆయన కైకాలకు సూచించారు. దీంతో విఠాలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘కనకదుర్గ పూజ మహిమ’ అనే చిత్రంలో తొలిసారి విలన్గా నటించారు. అయితే ఎన్టీఆర్ అగ్గిపిడుగు సినిమాతో ఆయన సినీ జీవితం మలుపుతిరిగింది. ఎన్నో సినిమాల్లో తన డైలాగ్ డెలివరితో హీరోలతో పోటీపడి ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అనంతరం కమెడియన్గా, తండ్రిగా, తాతగా కూడా రాణించారు. మొత్తంగా తన 60 ఏళ్ల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన నటుడు కైకాల ఒక్కరే కావడం గమనార్హం. ఎన్టీఆర్ ‘యమగోల’ సినిమాలో కైకాల పోషించిన యమధర్మరాజు పాత్ర ఆయనకు మరింత ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. యముడు అంటే కైకాల సత్యనారాయణ అనేలా చేసింది. ఆ తరవాత ‘యమలీల’ సినిమాలోనూ కామెడీ యముడిగా కైకాల అదరగొట్టారు. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

