KP Choudary | కొకైన్ విక్రయిస్తూ పట్టుబడ్డ ‘కబాలి’ చిత్ర నిర్మాత కేపీ చౌదరి
KP Choudary | హైదరాబాద్ : కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేపీ చౌదరి నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి కొకైన్ విక్రయిస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, రూ. 2.05 లక్షల నగదు, నాలుగు మొబైల్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
KP Choudary | హైదరాబాద్ : కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేపీ చౌదరి నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి కొకైన్ విక్రయిస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, రూ. 2.05 లక్షల నగదు, నాలుగు మొబైల్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి బీటెక్ చదివి, పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. కబాలి సినిమాకు తెలుగు నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశారు. వ్యవహరించారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.

అయితే సినీ రంగంలో నష్టాలు రావడంతో.. డ్రగ్స్ బిజినెస్‌లోకి దిగారు. గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించారు. సెలబ్రెటీలకు గోవాలో డ్రగ్స్ సరఫరా చేశారు. పబ్‌లో నష్టాలు రావడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకొచ్చారు. గోవా నుంచి తెచ్చిన వాటిలో కొన్నింటిని వినియోగించారు. మిగిలిన వాటిని నిన్న రాత్రి కిస్మత్పూర్ వద్ద విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి వెంట ఉన్న నైజీరియన్ పరారీ అయ్యాడు. పరారీలో ఉన్న నైజీరియన్‌పై గతంలో రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది అని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Cocaine
- drugs
- Kabali
- KP Choudary
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

