Kaathal The Core Movie | ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్బస్టర్ ‘కాథల్ ది కోర్’.. కానీ వారికి మాత్రమే.!
Kaathal The Core Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాథల్ ది కోర్. ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’, ‘క్రిస్టోఫర్’, ‘కన్నూర్ స్క్వాడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మమ్ముట్టి నటించిన తాజా చిత్రమిది.
Kaathal The Core Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాథల్ ది కోర్. ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’, ‘క్రిస్టోఫర్’, ‘కన్నూర్ స్క్వాడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మమ్ముట్టి నటించిన తాజా చిత్రమిది. స్వలింగ సంపర్కుల పట్ల (Homosexuals) సమాజం ప్రవర్తించే తీరును ఆధారంగా చేసుకుని జియో బేబి ఈ సినిమాను తెరకెక్కించగా నవంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ప్రైమ్ వారికి గుడ్ న్యూస్ అందించింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇందులోనే చిన్న మెలిక ఉంది. ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే రెంటల్ విధానంలో అందుబాటులో ఉంచింది. ఇక ఇండియన్ స్ట్రీమింగ్కు సంబంధించి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
#KaathalTheCore Now Streaming In Tamil Telugu Malayalam Kannada Hindi In Overseas Prime Video Rental!
Coming soon in Jio Cinema for Free! (also in dubs) #Kathal#KathalTheCore#Kaathal
OTT pic.twitter.com/LwOYyROr8C— SRS CA TV (@srs_ca_tv) January 4, 2024
ఈ సినిమా కథలోకి వెళితే.. బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్ (మమ్ముట్టి).. భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. ఆ గ్రామంలో ఎన్నికలు రావడంతో మమ్ముట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే అతడు నామినేషన్ వేసిన తర్వాత జ్యోతిక అతడిపై విడుకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం ఉందని అందుకే విడాకులు కావాలని కోరుతుంది. అయితే ఈ ఆరోపణలను మమ్ముట్టి ఖండిస్తాడు. అయితే ఆ తరువాత ఎం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు ఈ సినిమాను తాజాగా బ్యాన్ చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

